- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇక వారందరి రేషన్ కార్డులు రద్దు
ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు కొనసాగాలంటే తప్పనిసరిగా e-KYC పూర్తి చేయించుకోవాలని, లేకపోతే ఆ కార్డులను రద్దు చేస్తామని అధికారికంగా పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు (ration card holders) ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు కొనసాగాలంటే తప్పనిసరిగా e-KYC పూర్తి చేయించుకోవాలని, లేకపోతే ఆ కార్డులను రద్దు చేస్తామని అధికారికంగా పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీ బియ్యం, పిండి, నూనె వంటి వస్తువులను పొందాలంటే ప్రతి సభ్యుడు తన వేలిముద్రను ఈ-పోస్ యంత్రంలో నమోదు చేయాలి అని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో ఉన్న లక్షలాదిమంది రేషన్ కార్డుల్లో e-KYC ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి కుటుంబ సభ్యుడు డీలర్ వద్ద e-KYC చేయించుకోవాలని, లేకపోతే ఆ కుటుంబాన్ని అనర్హుల జాబితాలో చేర్చుతామని హెచ్చరించింది. ఇలా జరిగితే రేషన్ కార్డుల ఆధారంగా పొందుతున్న ఇతర ప్రభుత్వ పథకాలపై ఇది ప్రభావం చూపనుంది. అధికారులు వెల్లడించిన ప్రకారం,,e-KYC ప్రక్రియ చాలా సులభం. రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర ఇవ్వడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ సదుపాయాలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ నవంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.






