- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gorantla Madhav: గోరంట్ల మాధవ్ వ్యవహారం.. 12 మంది పోలీసులపై వేటు
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Former MP Gorantla Madhav) అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Former MP Gorantla Madhav) అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఆయన అరెస్ట్ నాటి నుంచి గుంటూరు కోర్టుకు హాజరుపరిచే క్రమంలో గోరంట్ల మాధవ్ నిబంధనలు ఉల్లంఘించారని.. విధి నిర్వహణలో పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే విషయంపై సీరియస్ అయిన పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణ అధికారిగా గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ భానోదయ (Guntur South Zone DSP Bhanodaya)ను నియమించారు.
అయితే, గోరంట్ల మాధవ్ (Gorantla Madhav)ను నల్లపాడు (Nallapadu) పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ (GGH)కు వైద్య పరీక్షలకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి, అనంతరం కోర్టుకు తరలించే వరకు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ (CI), ఎస్సై (SI), ఇతర సిబ్బందిని డీఎస్పీ భానోదయ (DSP Bhanodaya) విచారించారు. ఆ నివేదికను గుంటూరు రేంజ్ ఐజీ (Guntur Range IG)కి సమర్పించగా.. ఆయన మొత్తం 12 మంది సిబ్బందిపై వేటు వేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో అరండల్‌పేట సీఐ వీరాస్వామి, పట్టాభిపురం, నగరంపాలెం ఎస్సైలు రాంబాబు, రామాంజనేయులు, ఏఎస్సైలు ఆంథోని, ఏడుకొండలు, నగరంపాలెం స్టేషన్‌కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, అరండల్‌పేటకు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు.






