- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో కొత్త అధ్యాయం.. గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సరికొత్త శకానికి నాంది పడింది. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో తర్లువాడలో 'గూగుల్ ఏఐ డేటా హబ్' (Google AI Data Hub) నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు గూగుల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గూగుల్ సంస్థ రాష్ట్రంలో మొత్తం రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్లను నిర్మించనుంది. 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టులు 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో తర్లువాడలో పనులు ప్రారంభం కాగా.. దీని కోసం ప్రభుత్వం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సుమారు 600 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు , రాంబిల్లి వద్ద 174.80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1.88 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేవలం నిర్మాణ దశలోనే 60 వేల మందికి పని దొరుకుతుందని అంచనా. సివిల్, ఎలక్ర్టికల్, మెకానికల్ వర్క్ ఫోర్స్ అవసరం ఉంటుందని సమాచారం. ఆసియా ఖండంలోనే గూగుల్ క్లౌడ్ సేవలకు విశాఖపట్నం ప్రధాన ముఖద్వారంగా (Gateway) మారబోతోంది. సబ్‌సీ కేబుల్ నెట్‌వర్క్‌కు ఇది కేంద్రం కానుండటంతో ఏఐ హబ్ గేట్ వే గా అంతర్జాతీయ స్థాయిలో వైజాగ్ పేరు మారుమోగనుంది.






