పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలు రద్దు

by Naga Rani Yarlagadda |

విజయనగరంలో గూడ్స్ రైలు పట్టాలు (Goods Train Derailed) తప్పింది.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరంలో గూడ్స్ రైలు పట్టాలు (Goods Train Derailed) తప్పింది. రైల్వేస్టేషన్ సిగ్నల్ వద్ద రైలు పట్టాలు తప్పగా.. మూడు బోగీలు ట్రాక్ పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. నేడు, రేపు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

నేడు విజయనగరం - విశాఖపట్నం (67288), విశాఖ - పలాస (67289), పలాస - విశాఖ (67290), విశాఖ - కోరాపుట్ (58538), బ్రహ్మపుర - విశాఖ ఎక్స్ ప్రెస్ (18525), విశాఖ - దుర్గ్ ఎక్స్ ప్రెస్ (18530), 30న కోరాపుట్ - విశాఖ (58537) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం గూడ్స్ రైలు ప్రమాదానికి గురైన చోట సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story