- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బియ్యం బదులుగా డబ్బులు.. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం వద్దు అనుకుంటే బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం వద్దు అనుకుంటే బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. కొల్లు రవీంద్ర కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని రాజంపేటలో రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేషన్ బియ్యం మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రజల నుండి వచ్చిన అభ్యర్థలను పరిగణనలోకి తీసుకుని చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. వైసీపీ హయాంలో పేదల బియ్యం దోచేసి వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఇంటింటికి రేషన్ పేరుతో కార్డు దారులు అందరినీ ఇబ్బందికి గురి చేశారని చెప్పారు. ఇకపై రేషన్ షాపుల్లో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్డు దారుల కోరికమేరకు బియ్యం బదులుగా రాగులు, సజ్జలు మరియు డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు.






