- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల
రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విద్యాశాఖ(Education department) ఇవాళ(ఆదివారం) 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ(Mega DSC)ని విడుదల చేసింది. మెగా డీఎస్సీ లో భాగంగా ప్రభుత్వం భర్తీ చేయనున్న 16,347 పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ఈ రోజు(ఆదివారం) నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.
వచ్చే నెల(మే) 20వ తేదీ నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలన్నీ పూరైన తర్వాత రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఏడు రోజులకు ఫైనల్ ‘కీ’ విడుదల చేస్తారు. అనంతరం వారం రోజులకు మెరిట్ జాబితా విడుదల చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు, అప్లికేషన్ చేసుకోవాడానికి https://cse.ap.gov.in లేదా https//apdsc.apcfss.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.






