ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!

by velandi.Saikiran |

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్. ఏపీలో ఉన్న పప్పు ధాన్యాల రైతులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచింది కేంద్రం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 94,500 టన్నుల పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 1.13 లక్షల టన్నులకు పెంచింది. మార్కెట్ లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శివరాజ్ సింగ్ చౌహన్ అధికారికంగా వెల్లడించారు.

అటు ఏపీకి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఏపీలో కందుల సేకరణ పరిమితిని 1.13 లక్షల టన్నులకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. దీనివల్ల మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు, కనీస మద్దతు ధరకు ప్రభుత్వానికి రైతులు అమ్ముకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక 2026 రబీ సీజన్ కోసం 23 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత ప్రభుత్వాల కంటే ఇది అత్యధికమని తెలిపారు.

Next Story