- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఉద్యోగులను తొలగించం.. మంత్రి గుడ్న్యూస్
సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గుడ్న్యూస్చెప్పారు

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గుడ్న్యూస్చెప్పారు. ఎవరినీ తొలగించబోమంటూ, వదంతులు నమ్మవద్దంటూ ప్రకటించారు. ఈ రోజు ఆయన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో చర్చలు నిర్వహించారు. ఉద్యోగుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ వేయాలని ఉద్యోగులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వార్డు, సచివాలయ ఉద్యోగులను ఏబీసీ కేటగిరీలకు హేతు బద్దీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలను రూపొందిస్తామన్నారు. హేతుబద్దీకరణ అంశపైనా ఈ కమిటీ పరిశీలిస్తుందన్నారు. రేషనలైజేషన్ప్రక్రియలో కొందరిని తొలగిస్తామని అపోహలు వద్దన్నారు. ఎవరినీ తొలగించడం లేదు.. కొన్ని శాఖలలో చాలా ఖాళీలు ఉన్నాయని వాటిలో భర్తీ చేస్తామన్నారు. మహిళా పోలీసుల విషయంలోనూ నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం శాఖను సంప్రదిస్తామన్నారు. డిపార్ట్మెంట్టెస్ట్పాస్కాకుండా పదోన్నతులు ఎలా వస్తాయన్నారు.






