ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక విశాఖ - అబుదాబి ఫ్లైట్ సర్వీసు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-28 03:05:57  IST  )

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసులకు విమానయాన సంస్థ ఇండిగో (Indigo) తీపి కబురు చెప్పింది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక విశాఖ - అబుదాబి ఫ్లైట్ సర్వీసు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసులకు విమానయాన సంస్థ ఇండిగో (Indigo) తీపి కబురు చెప్పింది. ఈ మేరకు విశాఖపట్నం (Vishakhapatnam) నుంచి నెరుగా అబుదాబి (Abu Dhabi)కి ఇంటర్‌నేషనల్ ఫ్లైట్ సర్వీసును జూన్ 13 నుంచి ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించింది. అయితే, ఆ సర్వీసు వారానికి నాలుగు రోజులు పాటు అందుబాటులో ఉంటుందని విమానయాన సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. వారంలో సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 8.20 గంటలకు ఫ్లైట్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఉదయం 9.50 గంటలకు అబుదాబికి బయలుదేరుతుందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబికి ఇప్పటి వరకు డైరెక్ట్ విమాన సర్వీసులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రయాణికులు హైదరాబాద్, బెంగళూరు (Bengaluru) లేదా చెన్నై (Chennai) మీదుగా అక్కడి వెళ్లేవారు. అయితే, విశాఖపట్నం - భువనేశ్వర్ మధ్య విమాన సర్వీసును నడిపేందుకు ఒడిశా సర్కార్ కూడా తమ సహకారాన్ని అందజేసింది. ఆ సర్వీసు జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1.55 గంటలకు ఫ్లైట్ విశాఖకు చేరుకుని, 2.25 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు.

Next Story