TTD News : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) మరో గుడ్ న్యూస్ తెలిపింది.

TTD News : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) మరో గుడ్ న్యూస్ తెలిపింది. నాణ్యతతోపాటు రుచికరమైన అన్నప్రసాదం అందించడమే తమ లక్ష్యం అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) పేర్కొన్నారు. ఇకపై అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలోనే కాకుండా రాత్రి భోజన సమయంలో కూడా వడలను వడ్డించనున్నట్టు పేర్కొంది. ఆదివారం తరిగొండ వెన్నమాంబ అన్నప్రసాద కేంద్రంలో బీఆర్ నాయుడు వడల పంపిణీని ప్రారంభించి స్వయంగా భక్తులకు వడ్డించారు. ప్రతిరోజు సుమారు 70 వేల వడలను తయారు చేయనున్నట్టు తెలిపారు.

Next Story