Government: గుడ్ న్యూస్ .. వారికి ఉచిత స్మార్ట్‌ఫోన్లు.. అర్హతలు ఇవే!?

by Jakkula.Mamatha |

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది

Government: గుడ్ న్యూస్ .. వారికి ఉచిత స్మార్ట్‌ఫోన్లు.. అర్హతలు ఇవే!?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రజా సంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మూగ, చెవిటి వారికి ప్రభుత్వం ఉచిత స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయనుంది. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్లు నిండిన వయసు, 40 శాతం వైకల్యం, మరియు సైన్ లాంగ్వేజ్ వచ్చిన వారు అర్హులని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు. వినికిడి లోపం ఉన్నవారిలో కమ్యూనికేషన్, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apdascac.ap.gov.inవెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

అర్హతలు..

*ఇంటర్మీడియట్ పాస్.

* వయస్సు 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ.

* సంకేత భాష తెలుసుకోవడం.

* 40% మరియు అంతకంటే ఎక్కువ RPwD చట్టం, 2016 లో పేర్కొన్న విధంగా వైకల్యం

* కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు.

* జీవితకాలంలో ఒకసారి మంజూరు చేయబడుతుంది.

అవసరమైన సర్టిఫికేట్స్:

* వైకల్య ధృవీకరణ పత్రం

* ఆధార్ కార్డు

* SSC సర్టిఫికెట్ (వయస్సు రుజువు)

* చెవిటి పాఠశాల ఆడియాలజిస్ట్/హెడ్ మాస్టర్ నుంచి సంకేత భాషా ధృవీకరణ పత్రం

* ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్

* SC/ST/BC విషయంలో కుల ధృవీకరణ పత్రం

* పాస్‌పోర్ట్ సైజు ఫోటో

* తాజా ఆదాయ ధృవీకరణ పత్రం/ BPL రేషన్ కార్డు. అర్హత గల వారు పైన తెలిపిన వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.

Next Story