‘ఏపీలో వారికి గుడ్ న్యూస్’.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

‘ఏపీలో వారికి గుడ్ న్యూస్’.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అలాగే, ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM pawan kalyan) పంచాయతీరాజ్ వ్యవస్థ(Panchayat Raj system) పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

ఈ నేథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ(Panchayat Department) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ పరిధిలోని సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు సరిహద్దుల్లో సేవలు అందించిన, రిటైర్డ్ సైనికులకు మాత్రమే మినహాయింపు వర్తిస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ తేల్చి చెప్పింది. సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం మన దేశ భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసే మన రక్షణ దళాల సైన్యం, నేవీ మరియు వైమానిక దళం, పారామిలిటరీ, CRPF సిబ్బంది యొక్క అచంచల ధైర్యాన్ని గౌరవిస్తుంది. ఇప్పటివరకు, ఈ మినహాయింపు రిటైర్డ్ సైనిక సిబ్బందికి లేదా సరిహద్దుల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది.

అలాగే, కూటమి ప్రభుత్వం ప్రతి సైనికుడికి మరియు వారి కుటుంబానికి అండగా నిలుస్తుంది. సరిహద్దుల్లో దేశ రక్షణ నేపథ్యంలో పాక్ కాల్పుల్లో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు.

Next Story