- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మహిళా ఉద్యోగులకు ఎన్డీయే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇదివరకు రెగ్యూలర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే మాతృత్వ సెలవులు ఉండేవి.
ఈ నేపథ్యంలో ప్రొబేషన్ పీరియడ్‌లో మాతృత్వ సెలవును డ్యూటీగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రొబేషన్ పీరియడ్‌లో మాత్రమే డ్యూటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగినులు ప్రసూతి సెలవులు(Maternity leave) తీసుకున్నా ప్రొబేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. ఈ మేరకు మెటర్నిటీ సెలవులను డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం తాజాగా గెజిట్ జారీ చేసింది. ఇక కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మహిళ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






