- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Lokesh:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో నోటిఫికేషన్ రిలీజ్?
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు విద్యాశాఖ(Education Minister) మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) శుభవార్త చెప్పారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు విద్యాశాఖ(Education Minister) మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) శుభవార్త చెప్పారు. నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. నేడు(శుక్రవారం) మంత్రి లోకేష్ మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్(NTR Bhavan)లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు స్థానాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Election)కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మార్చి 3న ఎన్నికల ఫలితాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల కోడ్(Election Code) ముగియగానే డీఎస్సీ(DSC) నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ క్రమంలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర లో 80 శాతం టీచర్ల నియామకం చేపట్టింది టీడీపీ(TDP)నే అని గుర్తు చేశారు.
టీచర్ పోస్టుల(Teacher Posts) భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయం పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో విద్యా శాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలు వింటున్నారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని.. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్‌ఫర్ యాక్ట్(Trancefer Act) తీసుకొస్తున్నం అని మంత్రి లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు.






