- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో నోటిఫికేషన్?

దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు తీపీ కబురు అందనుంది. ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన నేడు(మంగళవారం) కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. పలు అంశాలకు ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది. జాతీయ SC కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ ఏపీ ప్రభుత్వానికి చేరింది.
దీనిపై ఈ రోజు జరుగుతున్న కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అనంతరం 5 రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి ఆ తర్వాత మూడు రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో విద్యాశాఖ(Education Department) మెగా డీఎస్సీ(Maga DSC) నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ ఏడాది జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే.
Read More..