- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు తీపికబురు.. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని నిరుద్యోగులకు ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని నిరుద్యోగులకు ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు విశాఖపట్నం (Vishakhapatnam) పరిధిలోని కాపులుప్పాడ (Kapuluppada) ఐటీ హిల్స్‌లో రూ.1,583 కోట్లతో 22 ఎకరాల్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. భారత్‌లో కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో సుమారు 8 వేల మందికి పైగా నిరుద్యోగులకు ప్రత్యక్ష్యంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
2026లో 800 మంది అసోసియేట్లకు వసతి కల్పించేలా టెంపరరీ సెంటర్ ఏర్పాటుతో తమ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కాగ్నిజెంట్ ప్రతినిధులు పేర్కొన్నారు. 2029 ప్రారంభంలో పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటులోకి రానుందిని వెల్లడించారు. విశాఖపట్నం ప్రతిభకు, మౌలిక సదుపాయాలకు ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు కాగ్నిజెంట్ CEO ఎస్.రవి కుమార్ (S.Ravi Kumar) తెలిపారు. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సంస్థ విస్తరించాలనే లక్ష్యానికి అనుగుణంగా విశాఖపట్నం వేదికగా కొత్త క్యాంపస్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు.






