ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 3,220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 21 |
Ys Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 యూని­వర్సిటీల్లో ఏకంగా 3,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్‌ ప్రొఫెసర్, 2,001 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం 220 లెక్చరర్‌ పోస్టులతో కలిపి) పోస్టుల నియామ­కాలను చేపడుతోంది. ఉన్నత విద్యా మండలి ‘ఉమ్మడి పోర్టల్‌’ ద్వారా మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అభ్య­ర్థు­లపై ఆర్థిక భారం తగ్గించేందుకు అసిస్టెంట్‌ ప్రొఫె­సర్‌ పోస్టుకు మాత్రం ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

3,200 పోస్టుల నియామకానికి నోటీఫికేషన్

ఇకపోతే 18 యూనివర్సిటీల్లో 4,330 పోస్టులొచ్చాయి. వీటిల్లో ఇప్పటికే పని చేస్తున్న అధ్యాపకులు కాకుండా తాజాగా 3,200 మందిని నియమిస్తోంది. ఇక బోధన పోస్టులతోపాటు ప్రతి యూనివర్సిటీలో అకడమిక్‌ నాన్‌ వెకేషన్‌ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌/డిప్యూటీ డైరెక్టర్‌/ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌/డిప్యూటీ లైబ్రేరియన్‌/వర్సిటీ లైబ్రేరియన్, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్, నాక్‌ గుర్తింపులో కీలక భూమిక పోషించే ఐక్యూఏసీ డైరెక్టర్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్, ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ పోస్టులను తప్పనిసరి చేసింది.

దరఖాస్తు రుసుము ఇలా..

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500.. ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్‌ బెంచ్‌ మార్క్‌ విత్‌ డిజేబిలిటీ) రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో పరీక్షలు రాయాలనుకుంటే మాత్రం విడివిడిగా ఫీజులు చెల్లించాలి.ఇక ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు, ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.150 డాలర్లు/రూ.12,600, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 100 డాలర్లు/రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అభ్యర్థుల దరఖాస్తు కోసం వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచింది. వర్సిటీల వారీగా అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ తేదీలను దరఖాస్తు పరిశీలన అనంతరం వెల్లడించనుంది. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.

దరఖాస్తులకు గడువు :

ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు తుది గడువు: 20.11.2023

పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర పత్రాల సమర్పణ గడువు: 27.11.2023

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌కు అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితా ప్రదర్శన: 30.11.2023

అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్ట్‌ స్క్రీనింగ్‌ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08.12.2023Careers & Job Opportunities



Next Story

Most Viewed