- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో 7,673 పోస్టుల భర్తీకి కసరత్తు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సంస్థలో ఖాళీగా ఉన్న 7,673 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే 'స్త్రీ శక్తి' పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. పెరిగిన రద్దీకి అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ పాలక మండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం 7,673 పోస్టుల భర్తీకి ఆర్టీసీ బోర్డు అనుమతి కోరింది. రెగ్యులర్ డ్రైవర్లు 3,673 పోస్టులు, కండక్టర్లు1,813 పోస్టులు, ఇతర పోస్టులు మెకానిక్‌లు, శ్రామిక్‌లు, డిపోల్లోని వివిధ విభాగాల్లో ఖాళీలుగా గుర్తించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత ఆర్టీసీలో రెగ్యులర్ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతుండటంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.






