- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని నేతన్నలకు తీపికబురు.. రేపటి నుంచే ‘ఉచిత విద్యుత్’ పథకం షురూ
by Kema Shiva Kumar |
రాష్ట్రంలోని నేతన్నలకు కూటమి ప్రభుత్వం పండుగలాంటి వార్త చెప్పింది. రేపటి నుంచి హ్యాండ్‌లూమ్స్, పవర్‌లూమ్స్‌కు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ (Free Electricity) పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ చేనేత మగ్గాలకు (Handlooms) నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు. మర మగ్గాలకు (Powerlooms) నెలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ సరఫరా చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,04,488 చేనేత కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. పథకం అమలు కోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. ముడిసరుకు ధరల పెరుగుదల, మార్కెటింగ్ ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గడం వల్ల పెద్ద ఊరట లభించనుంది.
Next Story






