- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం కీలక ప్రకటన
by Jakkula.Mamatha |
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధి(State Development) పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధి(State Development) పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పేదలందరికీ ఇళ్ల పథకం లో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు. ‘వారు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు. బీపీఎల్(BPL) కుటుంబం అయి ఉండాలి. కచ్చితంగా ఆధార్(Aadhaar) ఉండాలి. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు’ అని పేర్కొన్నారు.
Next Story






