- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ration cards:పేదలకు శుభవార్త.. రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు(Ration cards) మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని కార్డులు రాని వారికి కూడా ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ చెప్పింది. వారితో పాటు కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు(Ration cards for new applicants) మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త రేషన్ కార్డులు(New Ration cards), పింఛన్లకు రేపటి(డిసెంబర్ 2) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుకగా అర్హులుగా జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది.






