- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం(AP Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన బేబీ కిట్ల సరఫరా పథకాన్ని పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను తాజాగా సీఎం చంద్రబాబు ఆమోదించారు. అయితే.. 2014-19 కాలంలో అమలైన ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది.
గతంలో ఈ పథకానికి జాతీయ ఆరోగ్య మిషన్(NHM) కింద కొంత మేరకు కేంద్ర సాయం అందేది. ఈ సాయాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. PH-ABHIM, PM మాతృత్వ వందన యోజన, 15వ ఆర్థిక కమిషన్ నిధుల కింద కూడా ఈ కిట్ల సరఫరాకు కేంద్ర ప్రభుత్వ సాయం లభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పథకానికి అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులనుంచే అందజేయాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు.
నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన 11 వస్తువులతో కూడిన ప్రతి బేబీ కిట్ కు రూ.1,410లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ పథకం కింద పంపిణీ చేసే వస్తువులు.. దోమ తెరతో కూడిన బేబీ బెడ్, వాటర్ ప్రూఫ్ కాట్ షీట్, బేబీ డ్రెస్, వాష్ బుల్ నేప్కిన్స్, టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సబ్బు, సోప్ బాక్స్ , బేబీ రాటిల్ టాయ్. రాష్ట్రం(Andhra Pradesh)లో జరిగి ప్రసవాల్లో సగానికి పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి.






