రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీ పై కీలక అప్డేట్

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీ పై కీలక అప్డేట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. రాష్ట్రం(Andhra Pradesh)లోని ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తునే ఉంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత వైసీపీ హయాంలో వచ్చిన అప్లికేషన్లలో 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అవి ప్రస్తుతం ప్రభుత్వ(AP Government) పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. ఈ నెలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల(New Ration Card) కోసం దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల(మే) 15 నుంచి వాట్సాప్‌లో ‘మనమిత్ర’ సేవ ద్వారా కొత్త అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తాజాగా ప్రకటించింది. జూన్ లో కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రజలు ఈ విధానం ద్వారా సులభంగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Next Story