- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE
ఏపీ(Andhra Pradesh)లో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పనుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) నెల్లూరు జిల్లా(Nellore District) సంగంలో పర్యటించారు. ఈక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల పాల్గన్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. వచ్చే(మార్చి) నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు. అలాగే పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈ క్రమంలో మహిళలందరూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దీపం-2 పథకం హామీని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నెరవేర్చారు అని తెలిపారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో 93.42 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఈ ఏడాది 1.50 కోట్లు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత జూలై, ఆగస్టులో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి పలు కారణాలతో ఈ అంశంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. గత వైసీపీ(YSRCP) హయాంలోనే కొత్త రేషన్ కార్డులు, మార్పులు చేర్పులకు సంబంధించిన రూ.3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.






