రాష్ట్రంలోని నేతన్నలకు గుడ్ న్యూస్.. కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-15 05:49:11  IST  )

రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది.

రాష్ట్రంలోని నేతన్నలకు గుడ్ న్యూస్.. కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు కార్మికులందరికీ త్వరలోనే ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్లుగా చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత (Minister Savitha) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఏదైనా ఒక రోజు కచ్చితంగా చేనేత దుస్తులు ధరించాలని ఆమె ఆదేశాలు జారీ చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు మర మగ్గాలకు గాను ఉచిత కరెంటు కూడా ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. రాబోయే విజయ దశమి నాటికి చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ చేనేత రంగాన్ని విస్మరించిందని, తాము అధికారంలోకి రాగానే చేనేత రంగం గాడిలో పడిందని పేర్కొన్నారు. అర్హులైన వారికి వర్క్‌షెడ్లను కూడా త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. ఇక నుంచి ఉత్పత్తులను 20 శాతం పెంచిన ధరలతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆప్కో చేనేత సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేస్తుందని మంత్రి సవిత అన్నారు.

Next Story