ఆశేష ఆంధ్ర ప్రజలకు తీపికబురు.. రాష్ట్రపతి భవన్‌కు ‘అమరావతి చట్టబద్ధత బిల్లు’

by Kema Shiva Kumar |

‘అమరావతి చట్టబద్ధత బిల్లు’పై కీలక అడుగు పడింది. రాష్ట్రపతి భవన్‌కు చేరిన ఈ బిల్లును న్యాయనిపుణుల సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించనున్నారు.

ఆశేష ఆంధ్ర ప్రజలకు తీపికబురు.. రాష్ట్రపతి భవన్‌కు ‘అమరావతి చట్టబద్ధత బిల్లు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆశేష ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరబోతోంది. రాజధాని అమరావతి (Amaravati)కి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు రూపొందించిన ‘అమరావతి చట్టబద్ధత బిల్లు’ (Amaravati Legal Validity Bill) తాజాగా రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan)కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఈ ప్రతిపాదనలను ప్రస్తుతం రాష్ట్రపతి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తోంది.

న్యాయనిపుణులతో సంప్రదింపులు

‘అమరావతి చట్టబద్ధత బిల్లు’ బిల్లుపై తుది నిర్ణయం తీసుకునే ముందు దేశంలోని రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రముఖ న్యాయనిపుణుల (Legal Expert)తో సంప్రదింపులు జరపనున్నారు. బిల్లులోని అంశాలు, రాజ్యాంగపరమైన నిబంధనలు, చట్టపరమైన లోసుగులు లేకుండా ఉండేలా కేంద్ర హోంశాఖతో కలిసి దీనిని క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు. ఈ పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన క్షణం నుంచే ‘అమరావతి చట్టబద్ధత బిల్లు’ అధికారికంగా చట్టరూపం దాల్చనుంది. దీంతో అమరావతి రాజధాని మనుగడకు శాశ్వత రక్షణ లభించడమే కాకుండా, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మార్పులు సంభవించినా రాజధాని విషయంలో గందరగోళానికి తావులేకుండా పట్టపరంగా పటిష్టమై పునాది ఏర్పడనుంది.

కాగా, ఈ చట్టం అమలులోకి వస్తే, అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల సేకరణకు మరియు పెట్టుబడుల రాకకు పూర్తి స్థాయి భరోసా లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, అమరావతి రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story