- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News:టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఏపీ(Andhra Pradesh)లో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు(Students) హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో అమ్మాయిలు 84.09 , అబ్బాయిలు 78.31 ఉత్తీర్ణత సాధించారు.
ఇక, ఈ టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ పడకుండా ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించింది. ఈ తరుణంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల(మే) 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. అలాగే ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది.
ఈ క్రమంలో ఈ నెల(మే) 19వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మే 18 వరకు స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. కోచింగ్ సెంటర్లను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని, సాధ్యపడకపోతే స్కూళ్లలోనే నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






