Government:విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు

by Jakkula.Mamatha |

రాష్ట్ర ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది.

Government:విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్ల(Private School))లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం పై ఇటీవల ఇచ్చిన జీవో 6ను రద్దు చేస్తూ విడుదల చేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కో విద్యార్థి(Student) పై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను https://www.tlm4all.com/2025/04/ap-1st-class-admissions-in-pvt-schools.html సందర్శించండి.

Next Story