- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Half Day Schools:విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఒంటిపూట బడులు
వేసవి కాలం(Summer Season) మొదలైంది. అయితే ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవి కాలం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు.

దిశ,వెబ్‌డెస్క్: వేసవి కాలం(Summer Season) మొదలైంది. అయితే ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవి కాలం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. వేసవి కాలంలో పాఠశాలలకు ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఈ మార్చి నెలలో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటలు దాటిన తర్వాత బయట అడుగు పెట్టలేని పరిస్థితులు కూడా చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతకు స్కూల్ విద్యార్థులు తట్టుకోవడం కష్టమే. ఈ ఎండల ప్రభావంతో వడదెబ్బ బారిన పడడం, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున స్కూల్ విద్యార్థులకు ఒంటిపూట బడుల(Half Day Schools) విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల(మార్చి) 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ(Education Department) సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష(Intermediate Exams)లు ప్రారంభమయ్యాయి. ఈ నెల(మార్చి) 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు(Tenth Class Exams) కూడా ప్రారంభం కానున్నాయి.






