శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతి-సింగపూర్ విమాన సర్వీసులు స్టార్ట్

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాడానికి ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతి-సింగపూర్ విమాన సర్వీసులు స్టార్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాడానికి ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. అయితే తాజాగా శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్(Good News) చెప్పారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌(Tirupati Airport) నుంచి సింగపూర్‌(Singapoor)కు ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ గురువారం గాలిలోకి ఎగిరింది. సీఎం చంద్రబాబు(CM Chandrababu), కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Minister Rammohan Naidu) కృషితో తిరుపతి నుంచి సింగపూర్‌కు ప్రైవేట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

ఈ క్రమంలో తిరుపతి నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు ఈ రోజు(శుక్రవారం) ఉదయం 5 గంటలకు MS లక్స్ ఏవియేషన్ సంస్థకు చెందిన తొలి ఫ్లైట్ రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌(Renigunta AirPort) నుంచి బయలుదేరింది. శ్రీవారి దర్శనానికి విదేశాల నుంచి వచ్చే వారు ఇప్పటి వరకు చెన్నై(Chennai), బెంగళూరు(Bengaluru), హైదరాబాద్(Hyderabad) వెళ్లి అక్కడి నుంచి రేణిగుంట రావాల్సి వచ్చేది. నేడు తిరుపతి నుంచి నేరుగా సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభం కావడంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story