రాష్ట్రంలోని స్కూళ్లకు గుడ్ న్యూస్

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

రాష్ట్రంలోని స్కూళ్లకు గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. పలు అభివృద్ధి కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇక గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ అస్తవస్తమైందని ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్(Minister Lokesh) పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలోని పాఠశాలల(School)కు శుభవార్త వచ్చింది. ఏపీ(Andhra Pradesh)లోని స్కూళ్లల్లో రూ.1450 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రౌండ్స్ అభివద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య తెలిపారు. 2026 నాటికి 855 స్కూళ్లలో ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story