స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(Andhra Pradesh) అభివృద్ధే(Development) లక్ష్యంగా ముందుకెళ్తోంది.

స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(Andhra Pradesh) అభివృద్ధే(Development) లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో గత వైసీపీ(YSRCP) ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని.. ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన పలు హామీలను త్వరలోనే అమలు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

తాజాగా పౌరసరఫరాల శాఖ(Minister of Civil Supplies) మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) కీలక ప్రకటన చేశారు. మే నెల నుంచి ప్రభుత్వ స్కూళ్ల(Govt School)లో విద్యార్థుల భోజనానికి నాణ్యమైన బియ్యం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ(Assembly) వేదికగా ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు(Social Welfare Schools), హాస్టళ్లకు క్వాలిటీతో కూడిన బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పారు. బియ్యం ఏ విధంగా సరఫరా చేయాలనేది త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించింది. గత వైసీపీ హయాంలో దెబ్బతిన్న విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మంత్రి లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్తో ప్రారంభించిన విషయం తెలిసిందే.

Next Story