- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి వేళ గుడ్‌న్యూస్.. వాట్సాప్ ద్వారా RTC టికెట్ బుకింగ్
by Gantepaka Srikanth |
సంక్రాంతి వేళ గుడ్‌న్యూస్.. వాట్సాప్ ద్వారా RTC టికెట్ బుకింగ్

X
దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సమీపిస్తోన్న వేళ ఏపీ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. వాట్సాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు వీలు కల్పించింది. మన మిత్ర ద్వారా(9552300009) వాట్సాప్ ద్వారా సేవలు అందించనుంది. తెలుగు, ఇంగ్లీష్‌లో వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు జిల్లా జిల్లాల ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పండుగ వేళ ఇది మంది ప్రయాణికులకు భారీ ఉపశమనం కలిగిస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతేడాది సంక్రాంతి సీజన్‌లో ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)కి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. జనవరి 8 నుంచి 20 వరకు ఆర్టీసీ 9,097 ప్రత్యేక బస్సులు నడిపింది. మూడు రోజుల్లో రూ. 60 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించింది. ఈసారి అంతకుమించి రాబట్టాలని చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Next Story






