Breaking:ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

by Jakkula.Mamatha |

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందింది.

Breaking:ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో వచ్చే నెల(ఆగస్టు) 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉచిత ప్రయాణానికి మొత్తం 11,000 బస్సుల్లో 74 శాతం బస్సులను కేటాయిస్తున్నామని APSRTC ఎండీ ద్వారకా తిరుమల రావు(Dwaraka Tirumala Rao) తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రస్తుతం జిల్లాలకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలకు విస్తరించడం పై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, బస్టాండ్లలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టామన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రం(Andhra Pradesh)లోని ఆర్టీసీ ఉద్యోగులకు ద్వారకా తిరుమలరావు శుభవార్త చెప్పారు. ఆర్టీసీలోని అన్ని ర్యాంకుల ఉద్యోగులకు వచ్చే నెలాఖరులోగా పదోన్నతులు కల్పిస్తామని వెల్లడించారు. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా పల్లెవెలుగు బస్సులు పెంపు పై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పల్లె వెలుగుతో పాటు ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని, మరో 600 బస్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం(AP Government) కసరత్తు చేస్తోందని ద్వారకా తిరుమల రావు తెలిపారు.

Next Story