- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం నిర్వాసితులకు గుడ్ న్యూస్... భూముల విలువ పెంపునకు గ్రీన్ సిగ్నల్
పోలవరం నిర్వాసితులకు భూముల విలువ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు అంశాలే ఎజెండాగా భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: పోలవరం నిర్వాసితుల(Polavaram Displaced Persons)కు రాష్ట్ర ప్రభుత్వం(State Government) గుడ్ న్యూస్ తెలిపింది. భూముల విలువ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు అంశాలే ఎజెండాగా భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం నిర్మాసితులకు ఎకరాకు ఇచ్చే పరిహారం రూ.12 లక్షలకు పెంచుతూ ఆమోదం తెలిపింది. అలాగే నిర్వాసితుల పరిహారానికి రూ.565 కోట్లు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. గ్యాస్ నిల్వలపై చర్చించిన కేబినెట్ పట్టణాల్లో పీఎన్‌జీల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. పట్టణాల్లో 9 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక పీఎన్‌జీ తీసుకుంటే ఉచిత గ్యాస్ రాయితీ ఇవ్వాలనీ నిర్ణయించింది. రాజధానిలో అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో అగ్నిప్రమాదాలు ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసింది. అమరావతిలో 2014లో అరటి తోటలు తగులబెట్టారని, ఇటీవల భూగర్భ పైపులు అగ్నికి దగ్ధమయ్యాయని, అమరావతి విధ్వంసం కోరే వారే పైపులు తగలబెట్టి ఉండొచ్చని కేబినెట్ అనుమానం వ్యక్తం చేసింది.






