- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పింఛన్ దారులకు గుడ్ న్యూస్
ఏపీలో సామాజిక భద్రత పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో సామాజిక భద్రత పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1న నూతన సంవత్సరం అప్షనల్ హాలిడే ఉండటంతో, సాధారణంగా ఆ రోజు పంపిణీ చేసే జనవరి నెల పెన్షన్లను ముందుగానే డిసెంబర్ 31న పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో వృద్ధాప్య, వికలాంగ, వితంతు తదితర సామాజిక భద్రత పెన్షన్లు పొందుతున్న లక్షలాది మంది లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా పెన్షన్ అందనుంది. వార్డు సచివాలయ సిబ్బంది డిసెంబర్ 30 నాటికీ నగదు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు బ్యాంకులకు ముందుగానే సమాచారం అందజేయాలని సూచించింది. మిగిలిన పెన్షన్లను జనవరి 2న పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ పెన్షన్లను వాలంటీర్లు లేదా గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ అందజేయనున్నారు. సంబంధిత శాఖలకు ఇప్పటికే ఆదేశాలు ఆదేశాలు జారీ చేయగా, లబ్ధిదారులు డిసెంబర్ 31న పెన్షన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.






