- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... 20 రోజుల్లో ప్రమోషన్లు
ఉద్యోగులకు మరో 20 రోజుల్లో ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది....

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగుల(Employees)కు ప్రభుత్వం గుడ్ న్యూస్(Good News) తెలిపింది. మరో 20 రోజుల్లో ప్రమోషన్లు(Promotions) ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు సకాలంలో ఉద్యోగంలో పదోన్నతులు కల్పించేలా ప్రత్యేక టైమ్ షెడ్యూల్(Special time schedule)ను ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ప్రతి సంవత్సరం పదోన్నతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఏపీ స్పెషల్ సీఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు అత్యవసర మెమోలు జారీ చేసింది. ప్రమోషన్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఈనెల 21లోగా ఇవ్వాలని సూచించింది. అలాగే ఈ ప్రతిపాదనలను సచివాలయానికి పంపేందుకు హెచ్‌వోడీలకు గడువు ఇచ్చింది. ఈనెల 23 నాటికి GADకి సంబంధిత ప్రతిపాదనలను పంపాలని ఆదేశించింది. మరోవైపు 29 నాటికి డీపీసీ పూర్తి చేసి మినిట్స్ శాఖా కార్యదర్శులకు అందించాలని చెప్పింది. ప్రమోషన్లపై ఈ నెల 31న జీవోలు జారీ చేయాలని సెక్రటరీలను ఆదేశించింది. ప్రమోషన్లపై కలెక్టర్లు కూడా అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.






