- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:రైతులకు గుడ్ న్యూస్..మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గురువారం నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో రైతులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని రైతులందరికీ వచ్చే ఏడాది నుంచి కొత్త ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ స్కీమ్‌ను అమలు చేస్తామన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకునేలా బ్రహ్మాండమైన పాలసీని కేబినెట్ సబ్ కమిటీ రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మాత్రం పాత పాలసీనే కొనసాగిస్తామని చెప్పారు.






