- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బుల జమ పై కీలక ప్రకటన?
పీఎం కిసాన్ డబ్బుల గురించి రైతన్నలు ఎన్నో రోజులనుంచి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: పీఎం కిసాన్ డబ్బుల గురించి రైతన్నలు ఎన్నో రోజులనుంచి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను మోడీ సర్కార్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. పీఎం కిసాన్ 20 విడత డబ్బుల పై నేడు(శుక్రవారం) ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ రోజు బీహర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.
ఆ పర్యటనలోనే పీఎం కిసాన్ నిధుల విడుదలపై పీఎం మోడీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడాదికి 3 విడతల చొప్పున రూ.6 వేలు జమ చేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 9.80 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత డబ్బులను డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పీఎం కిసాన్ నిధులు విడుదల అయితే.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
*రైతులు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inను సందర్శించాలి.
*హోమ్‌పేజీలోని "Farmer Corner"లో "Beneficiary List" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
*రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం ఎంపిక చేసుకోవాలి.
*"Get Report" క్లిక్ చేస్తే జాబితా కనిపిస్తుంది.
*అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వెబ్‌సైట్ లేదా మన మిత్ర హెల్ప్‌లైన్ (9552300009) ద్వారా వాట్సాప్‌లో ఆధార్ నంబర్ పంపి స్టేటస్ తెలుసుకోవచ్చు.






