- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రాక్వా మహిళలకు శుభవార్త అందింది. డ్రాక్వా మహిళలకు 48 గంటల్లోనే రుణాలు అందించేలా చర్యలు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రాక్వా మహిళలకు శుభవార్త అందింది. డ్రాక్వా మహిళలకు 48 గంటల్లోనే రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటోంది సర్కార్. జనవరి కానుకగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. జనవరి మాసం నుంచి స్వయం ఉపాధి రాయితీ రుణాల కోసం ఉన్నతి 2.0 పథకాన్ని అమలు చేయనున్నట్లు సాంఘిక గిరిజన సంక్షేమ కార్యదర్శి ఎంఎం నాయక్ వెల్లడించారు. సెర్ఫ్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
స్వచ్ఛభారత్ పథకం కింద బీసీ హాస్టల్స్ లో 971 మరుగుదొడ్లు మంజూరు అయ్యాయని, వాటిని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అలాగే ఈ హాస్టల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటును ప్రాధాన్యంగా తీసుకోవాలని వెల్లడించారు. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు వివరించారు. డ్రాక్వా మహిళలకు 48 గంటల్లోనే రుణాలు అందించేలా సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీసీ వసతి గృహాలలో శుభ్రతతో పాటు అంగన్‌వాడీల్లో నాణ్యమైన పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అటు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక క్యాలెండర్ కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది సర్కార్.






