డైట్ కాలేజీలకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-12 06:26:40  IST  )

ఏపీలో డైట్ కాలేజీలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది..

డైట్ కాలేజీలకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదలకు  గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో డైట్ కాలేజీల(Diet Colleges)కు కేంద్రం(Center) గుడ్ న్యూస్ తెలిపింది. నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, గుంటూరు, నెల్లూరు డైట్ కాలేజీల(Visakhapatnam, Guntur, Nellore Diet Colleges)ను సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌(Center of Excellence)గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 43.22 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో మౌలిక సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీతో రూపకల్పన చేయనుంది. రాష్ట్రంలో 2028 నాటికి 13 డైట్ కాలేజీలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మూడు కాలేజీలకు నిధుల విడుదల చేయబోతోంది.

Next Story