Good News:భక్తులకు శుభవార్త.. 23 ఆలయాల్లో నిత్యాన్నదానం

by Jakkula.Mamatha |

ఆ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Good News:భక్తులకు శుభవార్త.. 23 ఆలయాల్లో నిత్యాన్నదానం
X

దిశ,వెబ్‌డెస్క్: ఆ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ(Andhra Pradesh)లో ఈ రోజు(మంగళవారం) దేవాదాయ శాఖ పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 23 ప్రధాన ఆలయాలు ఉండగా, వాటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో(Temples) మాత్రమే నిత్యాన్నదానం జరుగుతోంది అని తెలిపారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మిగిలిన 16 ఆలయాల్లో కూడా భక్తులకు అన్నదాన పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండే విధంగా భక్తుల(Devotees)కు పవిత్ర భావన కలిగేలా అందించాలని సూచించారు. ఇందుకోసం వాలంటీర్‌గా వచ్చేవారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. అన్నప్రసాద కార్యక్రమానికి ఆదాయం సరిపోని దేవాలయాలకు 7 ప్రధాన ఆలయాలు నుంచి నిధులు సమకూర్చేలా చూడాలి.

తిరుమల వెంగమాంబ అన్నప్రసాద తరహాలో నిబంధనలు పాటించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా రాష్ట్రంలో అన్నప్రసాద వితరణ జరగాలి. ప్రసాదాల నాణ్యతపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఆయా ఆలయాల ప్రసాదాల విశిష్టత కొనసాగేలా చూడాలి. నాణ్యత పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story