కాంట్రాక్టర్లకు తీపి కబురు.. ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |

ప్రభుత్వ పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

కాంట్రాక్టర్లకు తీపి కబురు.. ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విజయ దశమి సందర్భంగా దీర్ఘ కాలంగా బిల్లుల కోసం వేచి చూస్తున్న వారికి రూ.5 కోట్ల మేర నిధులు విడుదల చేస్తూ ఇవాళ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట విడతలో భాగంగా రూ.5 లక్షల మేర పనులు చేసిన కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఇవాళ ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది.

కాగా, టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు జగన్‌ (Jagan) సర్కారు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. కోర్టులకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చిన ఒక్క పైసా బిల్లులు చెల్లించలేదు. ఈ క్రమంలోనే ఎలాంటి తరతమ్యాలు లేకుండా సీఎం చంద్రబాబు (CM Chandrababu), జగన్‌ ప్రభుత్వ హయాంలో రాజకీయ కోణంలో చేపట్టిన పనులకు కూడా చకచకా బిల్లులు విడుదల చేస్తున్నారు. 2014-19 మధ్య పనులు చేసిన కాంట్రాక్టర్లతో పాటు, తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని దశల వారీగా క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ రూ.5 లక్షల వరకు పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు రూ.5 కోట్ల మేర బిల్లుల చెల్లింపులకు నిధులు విడుదల చేసింది.

Next Story