- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌లో బార్ లైసెన్స్(Bar License) రుసుమును భారీగా తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం(AP Government) మంగళవారం అధికారికంగా వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో బార్ లైసెన్స్(Bar License) రుసుమును భారీగా తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం(AP Government) మంగళవారం అధికారికంగా వెల్లడించింది. దీని ప్రకారం కడపలో లైసెన్స్ ఫీజు రూ.1.97 కోట్లు ఉండగా, ఇప్పుడిది రూ.55 లక్షలుగా ఉంది. అనంతపురంలో రూ.1.79 కోట్ల నుంచి, తిరుపతిలో రూ.1.72 కోట్ల నుంచి రూ.55 లక్షలకు తగ్గింది. దీనిని కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే రాష్ట్రమంతటా దరఖాస్తు రుసుమును కూడా రూ.5 లక్షలకు తగ్గించింది. ఈ పాలసీ బార్ లైసెన్సీలకు లాభదాయకంగా మారనుందని ఎక్సైజ్(Excise Department) కమిషనర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గతంలో బార్ లైసెన్స్ దారులు ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి వచ్చేది. బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపుతో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి బార్ లైసెన్సులను బహిరంగ లాటరీ ద్వారా కేటాయిస్తామని వెల్లడించారు.






