- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త.. రూ.8 వేల కోట్ల రుణాలు
ఏపీలోని డ్రాక్వా ( AP Dwakra women) మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇకపై భారీగా రుణాలు

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని డ్రాక్వా ( AP Dwakra women) మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇకపై భారీగా రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దాదాపు 8 వేల కోట్ల రూపాయల రుణాలను ఏపీ మహిళలకు అందించేలా... ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ ( MINISTER NARAYANA) కీలక ప్రకటన చేశారు. 2047 సంవత్సరం నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.
విజయవాడలో మెప్మా ( Mepma) కార్యక్రమంలో... మెప్మా వెబ్ సైట్ ను ( Mepma website ) మంత్రి నారాయణ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇకముందు 80,000 డ్రాక్వా సంఘాలకు దాదాపు 8 వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వబోతున్నట్లు వివరించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం 13 జిల్లాలలో మాత్రమే మెప్మా పీడీలు.. ఉన్నట్లు వివరించారు. వాటిని మొత్తం 26 జిల్లాలకు పెంచబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. ముఖ్యంగా మెప్మా విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కూడా తీర్చుతామని హామీ ఇచ్చారు. ఏపీ మహిళలు గర్వంగా బతికేలా కార్యక్రమాలు చేపడతామని మంత్రి నారాయణ ప్రకటన చేశారు.






