- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంధ్రప్రదేశ్‌కు తీపికబురు.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు అధికారిక హోదా
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coastal Railway - SCoR) ఏర్పాటుకు సంబంధించి అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇవాళ విడుదల చేసింది. దీంతో ఈ జోన్ ఏర్పాటుపై ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయి, అధికారిక హోదా లభించింది. విశాఖపట్నం కేంద్రంగా ఈ జోన్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, కొత్త రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది.
అదేవిధంగా త్వరలోనే విశాఖలో జోనల్ కార్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే కంప్లీట్ చేశారు. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3 వేల మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయనున్నారు.






