- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక రాజధాని పనులు మరింత వేగవంతం!
అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. అమరావతి(Amaravati) రాజధాని నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంకల్పానికి అన్ని వైపులా నుంచి సహకారం అందుతుంది. ఈ క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Narayana) వెల్లడించారు. ముంబయిలో జరిగిన సమావేశంలో నిధుల విడుదలను హడ్కో బోర్డు అనుమతి లభించిందని మంత్రి చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపామని తెలిపారు.
నిధుల విడుదలకు హడ్కో నిర్ణయం తీసుకోవడంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్, ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులు అభివృద్ధి పనులకు రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల సమీకరణ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టిసారించింది. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేసింది. రూ. 6 వేల 850 కోట్లు రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.
విడతలు వారీగా ఈ రెండు బ్యాంకులు కలిపి మొత్తం రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఇక మిగిలిన రూ.11 వేల కోట్ల నిధుల మంజూరుకు హడ్కో ఓకే చెప్పింది. గత అక్టోబర్‌లో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి హడ్కో అధికారులతో సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ప్రతిపాదనలను హడ్కో అధికారుల ముందు ఉంచారు. ఈ ప్రతిపాదనలపై సంతృప్తి చెందిన హడ్కో .. రుణం మంజూరు చేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిధులు విడుదలైతే రాజధాని పనులు వేగంగా మరింత ముందుకు సాగనున్నాయి.






