Government:ఆ ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-08 08:05:54  IST  )

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

Government:ఆ ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఈ తరుణంలో ఇంటర్మీడియట్‌(Intermediate) విద్యలో పని చేస్తున్న 3,572 మంది ఒప్పంద లెక్చరర్ల సర్వీసును.. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్‌ 1 నుంచి 2026 ఏప్రిల్‌ 30 వరకు పునరుద్ధరించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ(Education Department) కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉండగా.. ఏపీ(Andhra Pradesh)లో ప్రభుత్వ జూనియర్ కళాశాల(Govt Junior College)ల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల(గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జీతాల పెంపునకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధన ఉంది.

ఈ క్రమంలో గంటకు రూ.375 చొప్పున గరిష్ఠంగా నెలకు రూ.27వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. అయితే.. గత కొన్నేళ్లుగా వేతనం పెంచాలని గెస్ట్ ఫ్యాకల్టీ కోరుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారి సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం జీతాలు(Salary) పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Next Story