శ్రీవారి భక్తులకు అదృష్టమనే చెప్పాలి

by Thanuru Gopichand |

శ్రీవారి అభిషేక సేవ సమయంలోనూ భక్తులకు అనుమతి.

శ్రీవారి భక్తులకు అదృష్టమనే చెప్పాలి
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నడూ లేని విధంగా టీటీడీలో (TTD) సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం (Vaikunta Dwara Darshanam) టీటీడీ కల్పిస్తోంది. అందులో భాగంగా తొలి మూడు రోజులు టోకెన్లు పొందిన వారికి మాత్రమే టీటీడీ దర్శన అవకాశం కల్పించింది. నేటి నుంచి టోకెన్ లేని సామాన్య భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తోంది. అందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అందులోనూ వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. అందుకే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కీలక నిర్ణయాన్ని టీటీడీ తీసుకుంది. స్వామివారికి అభిషేక సేవ జరుగుతుందడగానే సర్వదర్శనానికి అనుమతినివ్వాలని నిర్ణయించింది. తద్వారా వీలైనంత ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం లభిస్తుందని టీటీడీ చెబుతోంది. జనవరి 8 వరకు ఈ నిర్ణయం అమలులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story