తుడా నిధుల గోల్‌మాల్‌.. చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి అవినీతిపై 4,300 పేజీలతో విజిలెన్స్ నివేదిక

by Malleboina Mahesh |

తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

తుడా నిధుల గోల్‌మాల్‌.. చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి అవినీతిపై 4,300 పేజీలతో విజిలెన్స్ నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధుల గోల్‌మాల్‌ (Funds Golmaal) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాం (YSRCP government rule)లో నిధుల దుర్వినియోగం జరిగిందని టీడీపీ నేతలు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో ఈ విజిలెన్స్ విచారణ కమిటీ (Vigilance Investigation Committee) విచారణ పూర్తి అయినట్లు తెలుస్తుంది. తుడా నిధుల గోల్‌మాల్‌పై విజిలెన్స్ దర్యాప్తు లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుమారుడు మోహిత్ రెడ్డిలపై అవినీతి ఆరోపణలకు సంబంధించి 4,300 పేజీల విజిలెన్స్ నివేదిక సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా ఛైర్మన్‌ (TUDA Chairman)గా ఉన్న సమయంలో నిధులను అడ్డంగా దోచుకున్నారని, ఆ తర్వాత ఆయన తన కుమారుడు మోహిత్ రెడ్డి (Mohit Reddy)కి ఆ పదవిని అప్పగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కుటుంబం తుడాను అవినీతిమయం చేసిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. తుడా నిధుల గోల్‌మాల్‌తో పాటు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కాం కేసులో కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికి వైసీపీ నేతలను వారి హయాంలో చేసిన అవినీతి ఆరోపణలు వెంటాడుతూనే ఉన్నాయి.

Next Story